కార్తీక పురాణం - 4వ అధ్యాయము
దీపారాధనా మహిమ
వశిష్ఠు మహర్షి కార్తీకమాస వ్రతము యొక్క మహిమ మరియు బ్రాహ్మణులు పొందిన బ్రహ్మ రాక్షసులు జన్మ నుండి విముక్తి నొందెదరని చెప్పు చుండగా జనకుడు ఆసక్తి తో 'మహా తపస్వీ! తమరు తెలియజేయు ఇతి హాసములు వినిన కొలదీ తనివి తీరకున్నది. కార్తీకమాసములో ముఖ్యముగా యేమేమి చేయవలయు నో, యెవరిని ఉద్దేశించి పూజ చేయవలయు నో వివరింపుడు' అని కోరగా వశిష్ఠుల వారు యిట్లు చెప్పుచున్నారు.
జనక మహారాజా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యము ల నూ చేయవచ్చును. కార్తీకమాసమందు దీపారాధనే అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయమున గాని, విష్ణ్వాలయము నందు గాని దీపాఆరాధనము చేయ వచ్చును. సూర్యాస్తమయము నందు దీపముంచి నవారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీకమాసమందు హరి హరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనె తో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదము తో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగు ల పుణ్యాత్ములు గాను, భక్తి పరులు గాను అగుట యే గాక అష్ట ఐశ్వర్యము లూ కలిగి శివ సాన్నిధ్యం పోందేదరు. ఇందు కొక కథ గలదు, వినుము.
శత్రాజితు కథ
పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగు జెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపము ఆచరించు చుండగా అచ్చటకు పిప్పలాదుడు అను ముని పుంగవుడు వచ్చి "పాంచాల రాజా! నీ వెందుల కింత తపము ఆచరించు చున్నావు? నీ కోరిక యేమి?" యని ప్రశ్నించగా, “ఋషి పుంగవా నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపద వున్ననూ, నా వంశము నిల్పుట కు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ గోదావరి తీరమున తపము ఆచరించుచున్నాను" అని చెప్పెను. అంత ముని పుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివ సన్నిధి న శివ దేవుని ప్రీతి కొరకు దీపా ఆరాధనము చేసినయెడల నీ కోరిక నెర వేరగలదు" యని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై భక్తితో శివాలయ మున కార్తీకమాసము నెలరోజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో నియమాను సార ముగా వ్రతము చేసి ప్రసాదముల ను ప్రజలకు పంచిపెట్టేను .తత్పుణ్య కార్యమువలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవ మాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములు జేసి, ఆ బాలునకు 'శత్రాజిత్తు' యని నామకరణము చేయించి అమిత గారాబము తో పెంచు చుండిరి. కార్తీకమాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగి నందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాకుమారుడు శత్రాజిత్తు దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి యుద్ధ విద్యలు నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేసి, తల్లితండ్రుల గారాబము చేత తన కంటికి అందము గా కనిపించే స్త్రీలను బలా త్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చు కొనుచుండెను.
తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచీ చూడనట్లు వినీ విననట్లు వుండిరి. శత్రాజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పే వాల్లను చంపేదనని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయు చుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున నొక బ్రాహ్మణపడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అంద చందములను వర్ణించుట మన్మధున కైననూ శక్యము గాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమెకూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయమంది రానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశు లగుటచేత వారు ప్రతిదినము అర్థరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచూ తమ కామవాంఛ తీర్చు కొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటుల నో యీ సంగతి ఆమె భర్త కి తెలిసి, భార్య నూ, రాజ కుమారు నీ ఒక్క సారిగా చంప వలయు నని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించు చుండెను ఇట్లు వుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు శివాలయంలో ఆ ఇరువురు కలుసు కొన వలెనని నిర్ణయించుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలు దేరిరి. ఈ సంగతి ని పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి యుండెను. ఆ కాముకులు ఇరువురు గుడిలో కలుసుకొని గాఢా ఆలింగన చేసుకొను సమయమున “చీకటిగా వున్నది, దీపము ఉండిన బాగుండును గదా,"యని రాకుమారుడు అనగా ఆమె తన పవిట చెంగు ను చించి అక్కడ వున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము ను వెలిగిం చెను. తర్వాత వారు ఇరువురు మహా ఆనందము తో రతి క్రీడలు సలుపుట కు వుద్యుక్తులు అగు చుండగా, అదే అదునుగా ఆమె భర్త తన మొల న ఉన్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్య నూ, ఆ రాజ కుమారు నీ ఖండించి తానుకూడా పాడుచు కొని మరణించెను. ఆ రోజు కార్తీకశుద్ధ పౌర్ణమి, సోమవారము పుణ్య దినము అగుట వలన వారిని తీసుకోని పోవుటకు శివ దూతలు,యమ దూతలు ఇరువురు వచ్చిరి .
*C:\Users\maake\Downloads\website\*/>
శివ దూతలు వచ్చింది ప్రేమికుల ఇరువురినీ తీసుకొని పోవుటకు.జారిణి యగు భార్యను, శత్రాజిత్తు ను చంపి, ఆత్మా హత్య చేసుకున్న బ్రాహ్మణుడిని తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చిరి. అంత యమ దూతలను చూచి న బ్రాహ్మణుడు “ఓ యమ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీ రేల వచ్చినారు? కామాంధ కారముతో కన్ను మిన్ను తెలియక పశు ప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభి చారుల కొరకు శివ దూతలు విమానము లో వచ్చు టేల? చిత్ర ముగా ను న్నదే!" అని ప్రశ్నించెను. అంత యమకింకరులు “ఓ బాపడా! వారికి తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్ని ధిన దీపం వెలి గించుట వలన అప్పటివరకూ నీచు లైననూ, యీ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమీ సోమవారము ఈ దినమున వారు చేసిన పాపములు అన్నియు ను నశించి పోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివ దూతలు వచ్చినారు" అని చెప్పగా, యీ సంభాషణ మంతయు విను చున్న రాజకుమారుడు “అలా యెన్న టికినీ జరుగ నివ్వను. తప్పొప్పులు యేలా గున్నా ఇప్పటికి మేము ముగ్గురమూ ఒకే సమయములో, ఒకే స్థలములో మరణించితి మి. కనుక ఆ ఫలము ముగరి కి వర్తించవలసి నదే" అని, తాము చేసిన దీపారాధన ఫలము లో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ను ఎక్కించి శివ సాన్నిధ్యము నకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయంలో దీపారాధన చేయుటవలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుట యే గాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున, కార్తీకమాసములో నక్షత్ర మాల యందు దీపముంచిన వారు జన్మ రాహిత్య మొందేదురు.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి నాలుగో అధ్యాయము
- నాల్గవరోజు పారాయణము సమాప్తము.