కార్తీక పురాణం - 14వ అధ్యాయము
కార్తీక పూర్ణిమ మాహాత్మ్యం
ఆంబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము)
మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహల ముతో ఇట్లు చేప్పుచున్నారు.
ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.
వారికి కోటియాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృ దేవత లును తమ వంశ మందు ఎవ్వరు ఆంబోతు నకు అచ్చు వేసి వదలు దురో అని ఎదురుచు చుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆంబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కావున ప్రతిసంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివ కేశవులకు ఆలయము నందు దీపా రాధన చేసి ఆ రాత్రి యంతము జాగరముండి మరు నాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.
కార్తీకమాసములో విసర్జింపవలసినవి
ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు. తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయ వలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడినీటితో స్నానము చేయ కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాస వ్రతం చేయవలె నన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయు వారలు గంగ, గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతః కాలమున స్నానము చేయవల యును. అటుల చేయని యెడల మహా పాపియై జన్మ జన్మములు నరక కూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువు నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నాన మాచరించవలెను.
శ్లో|| గంగే చ యము నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్ని ధిం కురు॥
అని పఠిం చుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాల క్షేప ములతో కాలము గడుప వలెను. సాయంకాలమున సంధ్యా వందనాదికాది కృత్య ములు ముగించి పూజా మంది రమున నున్న శివుని కల్పో క్తముగా ఈ క్రింది విధమున పూజింపవలెను.
(కార్తీకమాస శివ పూజాకల్పము)
1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి.
2. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి.
3. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి.
4. ఓం గౌరీనాథాయ నమః -పాద్యం సమర్పయామి.
5. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
6. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి.
7. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి.
8. ఓం జగన్నాథాయ నమః- యజ్ఞోపవీతం సమర్పయామి.
9. ఓం కపాల ధారిణే నమః గంధం సమర్పయామి.
10. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి.
11. ఓం మహే శ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి.
12. ఓం పార్వతీ నాథాయ నమః ధూపం సమర్పయామి.
13. ఓం తేజో రూపాయ నమః - దీపం సమర్పయామి.
14. ఓం లోక రక్షాయ నమః నైవేద్యం సమర్పయామి.
15. ఓం త్రి లోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి.
16. ఓం శంక రాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈవిధముగా శివపూజ చేసిన యెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెలరోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారి వంశీ యు లకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నా చరించని వారు వంద జన్మలు నానా యోను లందునా జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మ లెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రో క్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివి నను.. వి న్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.
*C:\Users\maake\Downloads\for learning\*/>
స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి చతుర్ద శా ధ్యాయము - పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము.