కార్తీక పురాణం - 21వ అధ్యాయము
పురంజయుని ధర్మమార్గమందు ఆగమనం
*C:\Users\maake\Downloads\for learning\*/>
*C:\Users\maake\Downloads\for learning\*/>
పురంజయుడు కార్తీకప్రభావము నెరుంగుట
ఈవిధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు, కాంభోజాధి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడు రథికుని తోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ, గదా, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండోరుల ఢీకొనుచు హూం కరించుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వ వీరత్వములను జూపుకొనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు- హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలె పడియున్న యేనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులన్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినారు . పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.
దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల' కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నుపు ఒకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తనుడవై వున్నందుననే యీ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱింగియు, నీవు చింతతో క్రుంగిపోవుటయేల? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తరిగిపొందవలెనన్న తలంపుకలదేని, నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీకమాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి గాన, స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు. శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధ మును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట వల్ల గదా నీకీ అపజయము కలిగినది? కావున లెమ్ము. శ్రీహరిని మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు"మని హితోపదేశము చేసెను.
*C:\Users\maake\Downloads\for learning\*/>
శ్లో॥ అపవిత్రః పవిత్రో వా నానావస్థాం గతో పివా
యః స్మరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః॥
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి ఏకవింశాధ్యాయము - ఇరవయ్యొకటోరోజు పారాయణము సమాప్తము.