కార్తీక పురాణం - 24వ అధ్యాయము
ఉషస్తిర్థ సంబంధమైన గ్రిహ శాంతి కార్యక్రమం
అంబరీషుని ద్వాదశీవ్రతము
*C:\Users\maake\Downloads\for learning\*/>
(అంబరీషుడు ద్వాదశి వ్రతం చేయుట )
అత్రిమహాముని మరల అగస్త్యునితో “ఓ కుంభసంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతవిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును, ఆలకింపుము.” "గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువారికిని అంతఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలముకంటె వేయిరెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానము ఎట్లో చెప్పెదను వినుము.
కార్తీక శుద్ధదశమి రోజున, పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశిరోజున యేవ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కలదు. దానినికూడ వివరించెదను. సావధానుడవై ఆలకింపు"మని యిట్లు చెప్పుచున్నాడు.
పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు తప్పకుండ వ్రతము చేయుచుండి వాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుకే ఆరోజు పెందలకడనే వ్రతము ముగించి భ్రాహ్మణ సమారాధన చేయదలచి అందున సిద్దముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడగు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును కావున తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్పానమునకై వెడలెను. అంబరీషుడు యెంతసేపు వేచియున్ననూ దూర్వాసుడు రాలేదు. ద్వాదశిఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి యింతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్తునకు ధర్మముగాదు. ఆయన వచ్చువరకు ఆగితినా ద్వాదశి ఘడియ దాటిపోవును. వ్రతభంగమగును. ఈ ముని మహాకోపస్వభావము గలవాడు. ఆయని రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరిభక్తిని వదలిన వాడనగుదును. ఏకాదశినాడు ఉవుపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. ఆదియునుగాక యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు" అని ఆలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయములేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగొట్టగలడు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచిదని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రానించి వారితో యిట్లు చెప్పెను.
“ఓ పండిత శ్రేష్ఠులారా! నిన్నటిదినమున యేకాదశి యగుటంజేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నాయింటికి దూర్వాస మహా ముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని, అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశిఘడి యలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక, వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేవరకు వేచియుండవలెనా? ఈరెంటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు, ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా ఆలోచించి
"మహారాజా! సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్య ముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయ ముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ-దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవు నందరు సదా పూజించవలెను. గృహస్థు, యింటికి వచ్చిన అతిధి కడజాతివడైననూ 'భోజన మిడుదు'నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందు లోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహాతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తామ భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుఃక్షీణము కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్తమగును" అని విశదపరచిరి.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి చతుర్వింశాధ్యాయము - ఇరవై నాలుగోరోజు పారాయణము సమాప్తము