కార్తీక పురాణం - 25వ అధ్యాయము
దర్శన సంబంధమైన కార్తీక వ్రత విధానం
దూర్వాసుడు అంబరీషుని శపించుట
*C:\Users\maake\Downloads\for learning\*/>
(అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దూర్వాసుడు వేంచేయుట )
"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు. “ఓ పండితోత్తములారా! నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్ఠను. విడచుటకన్న, విప్రశాసము అధికమయినదికాదు. జలపానము చేయుటవలన బ్రాహ్మ ణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు. నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారియెదుటనే జలపానము నొనరించెను.
*C:\Users\maake\Downloads\for learning\*/>
(దూర్వాసుడు అంబరీషుడు నికి శపించుట )
అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నానజపా దులు పూర్తిచేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్లవెంట నిప్పులు గ్రక్కుచూ " ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేన రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మపరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాము తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున, నీవు నమ్మకద్రోహి వగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనము నకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి, అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా? నీవంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు, మునికోపమునకు గడగడ వణకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయాదాక్షిణ్యములు గలవారూకావున, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికి శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవజన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవజన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడుగాను, ఆరవజన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యము గాని, సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, పదవజన్మలో పావబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక!" అని వెనుక ముందు ఆలోచించక శపించెను.
ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణశాపము వృథా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే మీ శాపమను అనుభవింతు"నని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడి కన్నూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను.ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వాసు నిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశకలిగి అచటినుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజ స్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడ మని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మ లోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరునీ యెంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేక పోయిరి.
*C:\Users\maake\Downloads\for learning\*/>
(ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వాసు ని తరుముట )
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి పంచవింశాధ్యాయము - ఇరవయ్యయిదవరోజు పారాయణము సమాప్తము