ௐ

కార్తీక పురాణం - 26వ అధ్యాయము

కార్తీక చతుర్దశీ సంబంధమైన ఆయు విర్ధిం

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

durvasavishnu2

(దూర్వాసుడు లక్ష్మీ నారాయణులను ఆశ్రయించుట)

ఈవిధముగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిపి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

21:44 13-11-2025

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్య లోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించు వారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్ళి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణా బిరుదాంకితా! రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ హృదయం (ఉదరము)పై తన్నినను సహించితివి. ఆ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్థలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీ హరీ! నీ చక్రాయుధము నన్ను బంపవచ్చుచున్న"డవి దూర్యాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివరముల ప్రార్థించాడు.

ఆవిధముగా దూర్యాసుడు అహంకారమును వదలి తనను ప్రార్ధించుట చూచి శ్రీవారి చిరునవ్వు నవ్వి "దూరాసా! నీమాటలు యదార్థములు, నీవంటి తపోధనులు వాకత్యంత ప్రియులు, నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను జూచినవారు మూడు లోకములందు భయపడమందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టిహింసా కలిగించను. ప్రతియుగమందున గో, రేవ బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితు లకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును, నీ వకారణముగా అంబరీషుని శపించితిని. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణిసమూహము నా రూపముగానే జూతుము. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నాభక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ యెడమపాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథివై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశిఘడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు ప్రతభంగమునకు భయపడి, వీరాక్షకై చూచిచూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేష్ చేసెను! తాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ధ దినములందు కూడ జలపానము దాహ శాంతికివి, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రముడవా భక్తుని చూపించి శపించితివి. అతడు ప్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున వమ్మ శరణు వేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పదిజన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీవలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకొనే స్థితిలో లేదు. వీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు. నిరపరాధి దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటివానిని ఆకారణముగా దూషించితివి. అతనిని విష్కారణ ముగా శపించితిని, విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అచెటులనిన నీ శాపములోని మొదటిజన్మ మత్స్యజన్మ. నేవీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపముననా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహజన్మ మెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును, బలిచే స్వర్గమునుండి పారద్రోల బడిన ఇంద్రువకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని ఇంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును, పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడన విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వామాధుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరమ మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున విచ్చిన పదిజన్మలను యీవిధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి వొసంగుదును. ఇది ముమ్మాటికి తధ్యము.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి షడ్వింశాధ్యాయము - ఇరవయ్యారోరోజు పారాయణము సమాప్తము.