కార్తీక పురాణం - 27వ అధ్యాయము
సంధ్యాపూజన సంబంధమైన కార్తీక వ్రతం
*C:\Users\maake\Downloads\for learning\*/>
(దూర్వాసుడు కి నారాయణుడు హితభోద చేయుట )
దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట
మరల అత్రిమహాముని ఆగస్త్యున కిట్లు వచించెను కుంభసంభవా!ఆ శ్రీహరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకము యిట్లు చెప్పను.
"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పదిజన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము బెత్తుట కష్టము గాదు. నీవు తపశ్ళాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను, అందులకు నే అంగీకరించితివి. బ్రాహ్మణుల మాట ఆసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము, నీవు అంబరీషుని యింట భుణింపకా వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్ప నెంచినాడు. ఆకారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను, ప్రజారక్షణమే రాజధర్మముగాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనతో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని
తప్ప మరెవ్వరినీ యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకములేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును- బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని శిఖబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగమొనరించిన వాడును బ్రహ్మహంత కులే అగుదురు. కావున, ఓ దూర్వాస మహర్షీ! అంబరీషుడు నీగురించి- తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నామూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడవయితినే- యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ వుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసుడు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమాహాత్మ్యమందలి సప్తవింశాధ్యాయము - ఇరవయ్యేడవరోజు పారాయణము సమాప్తము.